ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు యూఎస్ జడ్జి ఆదేశం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన చారిత్రక వాషింగ్టన్ గోల్ఫ్ కోర్సులో చెట్లను నరకవద్దని అమెరికా ఫెడరల్ జడ్జి ఒకరు ఆదేశించారు. గోల్ఫ్ కోర్సు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇప్పటికే అక్కడ కనీసం 400 చెట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అనా రేయస్ సోమవారం తాజాగా ఆదేశాలు జారీ చేస్తూ ఇకపై చెట్ల నరికివేతను ఆపేయాలని స్పష్టం చేశారు. గోల్ఫ్ కోర్సు ప్రాంతంలో శాశ్వత మార్పులు చేపట్టదల చుకుంటే పది రోజుల ముందుగా లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చారు. న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ కోర్సులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు. గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్ట్ పనులను వ్యతిరేకి స్తున్న ప్రజలకు హెచ్చరికలు జారీ చేయకుండానే కార్మికులు వంద లాది చెట్లను నరకడంతో వివాదం చెలరేగింది. దీనిపై డీసీ ప్రిజర్వే షన్ లీగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆధునీ కరణ పనుల కారణంగా వాషింగ్టన్ చరిత్రలోని ముఖ్య మైన భాగానికి నష్టం వాటిల్లుతుందని వాదించింది. పునరుద్ధరణ పనుల విషయం లో ప్రభుత్వం పర్యావరణ చట్టాలను అనుసరిస్తోందా అని ప్రశ్నించింది.







కామెంట్లు (0)