Magazines

నేడు తీరం దాటనున్న అర్నబ్‌

1 గంట క్రితం

landfall today
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్‌ అర్నబ్‌ ‌కొనసాగుతున్నది. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో తుపాన్‌ గరిష్ఠంగా గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలి వేగం అప్పుడప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వరకు పెరగవచ్చు. ఏపీలో తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది. తుపాన్‌ సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. తుపాన్‌ ఎఫెక్ట్‌ ‌తెలంగాణ మీద కూడా కొంత ప్రభావం చూపే అవకాశముంది. రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా హెచ్చరించారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. ఆ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్