దుబాయి : భారత్, సౌదీ అరేబియా మధ్య విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కొనసాగుతోంది. జెడ్డాకు ఈ నెల 18 వరకూ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నామని అకాశ ఎయిర్ సంస్థ ఆదివారం ప్రకటించింది. సౌదీ అరేబియాలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని
తెలియజేసింది. రియాద్ నుంచి రాకపోకలు సాగించే విమానాలను ఈ నెల 30 వరకూ నిలిపి వేస్తున్నా మనీ చెప్పింది. జెడ్డా, రియాద్, దమ్మమ్ నగరాలకు రాకపోకలు సాగిస్తున్న తమ విమాన సర్వీసులను ఈ నెల 14 వరకూ నిలిపివేస్తున్నామని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండు రోజుల క్రితమే ప్రకటిం చాయి. విమానాశ్రయాలు సహా కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడుల కారణంగా విమానాల రాక పోకల్లో అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే.







కామెంట్లు (0)