Magazines

మా వేదన మీకు ఆనందమా ?

53 నిమిషాల క్రితం

suffering a source
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రంప్‌ను నిలదీసిన ఛాప్‌మన్ కుటుంబం

లండన్ : యార్క్‌షైర్‌లోని జూలో ఈ వారం పులి జరిపిన దాడిలో బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫుటేజ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంపై ఆయన కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుండు మీద కారం చల్లుతూ... తాను పులితో కుస్తీ పడుతున్నట్లుగా ఏఐ రూపొందించిన వీడియోను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్కులోని జంతువుల ఎన్‌క్లోజర్‌లో విలియం ఛాప్‌మన్ చనిపోవడానికి ముందు అతని చివరి క్షణాలకు సంబంధించిన ద శ్యాలను అనుకరిస్తూ ట్రంప్ వీడియో మొదలవుతుంది. ఆ తర్వాత ట్రంప్ ఆ పులిని తరిమేసి దానితో సరదాగా కుస్తీ పడతారు. పులి తన పంజాతో 23 సంవత్సరాల ఛాప్‌మన్‌ను కొట్టడం ప్రారంభించిన క్లిప్పింగ్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పంచుకుంటూ ‘ప్రక తితో ఎప్పుడూ చెలగాటం ఆడవద్దు’ అని వ్యాఖ్యానించారు. ఈ క్లిప్పింగ్ పులి వైపు ఛాప్‌మన్ వేలు చూపించడంతో ముగుస్తుంది. కానీ ఆయన చివరి క్షణాలను చూపించదు. సింహాలు, పులులు తమ సంరక్షకులపై దాడి చేసిన వివిధ సందర్బాలతో రూపొందించిన మరో క్లిప్‌ను కూడా ట్రంప్ పోస్ట్ చేశారు.

దేశ విదేశాల్లోని తన రాజకీయ శత్రువులను కించపరుస్తూ తనను తాను హీరోగా చిత్రీకరించుకోవడానికి ట్రంప్ ఏఐని ఉపయోగిస్తుంటారు. ప్రజలను దిగ్భ్రాంతికి, అసహనానికి, ఆగ్రహానికి గురిచేసి వారిని రెచ్చగొట్టే కంటెంట్‌ను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసిన చరిత్ర కూడా ట్రంప్ సొంతమే. సోషల్ మీడియా క్లిప్పింగుల కోసం తమ వేదనను ట్రంప్ వాడుకోవడం, ఇతరులు దానిని షేర్ చేయడం వంటి చర్యలను ఛాప్‌మన్ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ‘ఈ నష్టంతో ఆ కుటుంబం పూర్తిగా కుంగిపోయింది. జరిగిన దానిని జీర్ణించుకోవడానికి దానికి చాలా కాలం పడుతుంది’ అని బంధువులు తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈ సమయంలో తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న మీడియా కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం వారికి తీవ్ర వేదనను కలిగిస్తోందని, దీనిని వెంటనే ఆపాలని కోరారు. కాగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఛాప్‌మన్ ఆకస్మికంగా ఎన్‌క్లోజర్‌లో ప్రవేశించడంతో సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత జూను మూసివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్