Magazines

కెనడా సైనిక స్థావరం వద్ద భారీ అగ్నిప్రమాదం

1 గంట క్రితం

Canadian military
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

పలువురి మృతి ?
అల్బర్టా : కెనడాలోని అల్బర్టాలో ఉన్న సైనిక స్థావరం సమీపంలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. రక్షణ మంత్రి డేవిడ్‌ మెక్‌గింటీ విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలేమిటో ఆయన చెప్పలేదు. అగ్నిప్రమాదం జరిగిన కెనడా ఫోర్సెస్‌ బేస్‌ వెయిన్‌రైట్‌ స్థావరం దేశంలో అత్యంత రద్దీగా ఉండే సైనిక శిక్షణా కేంద్రాలలో ఒకటి. శిక్షణకు సంబంధించిన విన్యాసం సందర్భంగా గ్యాస్‌ లైన్‌ లేదా గ్యాస్‌ బావి దెబ్బతినడంతో కనీసం ఏడుగురు చఁపోయారని, అనేక మంది గాయపడ్డారని సైనిక వర్గాలను ఉటంకిస్తూ కెనడా టీవీ నెట్‌వర్క్‌ గ్లోబల్‌ న్యూస్‌ తెలిపింది. ఓ తీవ్రమైన ఘటన భారీ అగ్నిప్రమాదానికి దారితీసిందని ప్రధాని మార్క్‌ కార్నే చెప్పారు. కాగా ఎడ్మంటన్‌లోని రాయల్‌ అలగ్జాండ్రా ఆస్పత్రి 'కోడ్‌ ఆరంజ్‌'ను ప్రకటించింది. అధిక ప్రాణనష్టం జరిగినప్పుడు ఈ విధమైన ప్రకటన వెలువడుతుందఁ కెనడా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (సీబీసీ) చెప్పింది. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, అవి స్థావరం కంచెలను దాటుకుంటూ వెళ్లాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయినప్పటికీ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్