Magazines

పాకిస్తాన్ లో కూలిన స్కూల్ పైకప్పు

55 నిమిషాల క్రితం

collapses in Pakistan
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

34 మంది చిన్నారులు మృతి... శిథిలాల కింద మరికొందరు!
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ప్రమాదం


పెషావర్ : పాకిస్తాన్ లో ని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఓ ప్రయి వేట్ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 34 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదన లతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పెషావర్ నగరంలో ఉన్న దిర్ కాలనీలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఆరుగురు బాలికలతో సహా 28 మంది విద్యార్థులు, ఓ మహిళా టీచర్ మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరణించిన చిన్నారులందరూ 13 ఏండ్ల లోపు వారే కావడం అందరినీ కలచివేస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చాలా మంది పిల్లలకు తల భాగంలో గాయాలవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. శిథిలాల కింద మరికొందరు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది చిక్కుకుని ఉండొచ్చన్న ఆందోళనతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి బాధ్యుడిగా భావిస్తున్న పాఠశాల యజమానిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పెషావర్ సిటీ పోలీస్ చీఫ్ మియాన్ సయీద్ వెల్లడించారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యతా లోపమే ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అభంశుభం తెలియని 28 మంది చిన్నారులు విగతజీవులుగా మారడంతో పెషావర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


సోదరి ఫోన్ చేసిన వెంటనే పరుగెత్తుకెళ్లా

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికుడు సోహైల్ మీడియాతో చెప్పారు. "ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నా సోదరి ఫోన్ చేసి త్వరగా స్కూల్కు రమ్మని చెప్పింది. స్కూల్పై కప్పు కూలిపోయిందని చాలా మంది పిల్లలు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలిపింది. వెంటనే నేను, స్థానికులు కలిసి ప్రమాద జరిగిన చోటుకు పరుగెత్తుకెళ్లాం. శిథిలాల కింద చిక్కుకున్న చాలా మంది పిల్లలను బయటకు తీయడానికి ప్రయత్నించాం" అని చెప్పారు. ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే విద్యార్థుల కుటుంబీకులు వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్