2-1తో వన్డే సిరీస్ ఆసీస్-ఏ వశం
పుదుచ్చేరి : భారత్-ఏ, ఆస్ర్టేలియా-ఏ జట్ల యూత్ వన్డే సిరీస్ కంగారూల సొంతమైంది. ఆదివారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో భారత్-ఏ ఊరట విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 47.3 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. సూర్యాంశు షెడ్జె (66, 60 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ ప్రియాన్షు ఆర్య (49, 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విప్‌రాజ్ నిగమ్ (40, 44 బంతుల్లో 6 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (33, 57 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), ప్రభుసిమ్రన్ సింగ్ (39, 34 బంతుల్లో 6 ఫోర్లు) సమిష్టిగా రాణించారు. ఆసీస్-ఏ బౌలర్లలో బెన్ (3/38), విల్ (3/44), స్కాట్ (2/27) రాణించారు. 276 పరుగుల ఛేదనలో ఆస్ర్టేలియా-ఏ 46.2 ఓవర్లలో 226 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్-ఏ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో ఓపెనర్ జోశ్ ఫిలిప్ (56, 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ మెక్‌స్వీనీ (39, 58 బంతుల్లో 1 ఫోర్) మెరిసినా.. భారత్-ఏ బౌలర్లు గుర్జప్నీత్ సింగ్ (3/56), యశ్ ఠాకూర్ (2/35), నిశాంత్ సింధు (2/42) ఆసీస్‌ను కట్టడి చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన విప్‌రాజ్ నిగమ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.






కామెంట్‌లు (0)