Magazines

కార్మికుల సంక్షేమమే సీఐటీయూ లక్ష్యం

1 గంట క్రితం

​ఎర్ర జెండా నేర్పిన క్రమశిక్షణ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

ఎర్ర జెండా క్రమశిక్షణతోనే మెరుగైన వేతన ఒప్పందాలు : 
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, మహేంద్ర అండ్ మహేంద్ర యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు

​నవతెలంగాణ-జహీరాబాద్

​ఎర్ర జెండా నేర్పిన క్రమశిక్షణతోనే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల పక్షపాతిగా మెరుగైన వేతన ఒప్పందాలను చేయడం జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మహంకాల్ బాంకెట్ హాల్‌‌లో ఏర్పాటు చేసిన కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చుక్క రాములు హజరై మాట్లాడుతూ.. నేడు ప్రపంచ పరిణామాల ప్రభావంతో కార్మిక వర్గంపై మోయలేని భారాలు పడుతున్నాయని, వాటన్నిటి పట్ల కార్మికులందరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో రాబోవు రోజుల్లో కార్మికుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందన్నారు. మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరూ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్నందున ఈ పరిశ్రమకు దేశవ్యాప్తంగా యూనిట్లు ఉండడంతో ఏ ఒక్క పరిశ్రమలో ఉత్పత్తులు నిలిచిపోయినా యజమాన్యానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండయన్నారు. ఈ విధమైన పరిశ్రమలలో వేతన ఒప్పందాలు చేయడం అంటే సాహసంతో కూడుకున్న పని అని తెలిపారు. మహేంద్ర అండ్ మహేంద్ర చరిత్రలో బొంబాయి బోనస్ తో పాటు, దసరా పండుగకు సెలవలతోపాటు ఓటి, ట్రాన్స్‌‌పోర్ట్‌ సౌకర్యం, ‌టీఏ డీఏలను సాధించిపెట్టిన ఘనత తమ సంఘానికి దక్కుతుందన్నారు. ఏడి ప్లాంట్, ట్రాక్టర్ ప్లాంట్‌‌లో పనిచేస్తున్న కార్మికులు నిరంతరంగా ఒకే యూనియన్‌ ‌ను గెలిపించుకోవడంతో ఈ విజయాలు సాధించడం జరిగిందన్నారు. ఏటీ ప్లాంట్‌లో రిటైర్మెంట్ అవుతున్న కార్మికుడికి లక్ష రూపాయల వేతనం ఉంటే ట్రాక్టర్ ప్లాంట్‌ లో తాము చేసిన వేతన ఒప్పందంతో అపా‌యింట్‌‌మెంట్‌ అవుతున్న ఉద్యోగికి 64 వేల జీతం లభిస్తుందంటే రిటైర్మెంట్ వరకు ఏ స్థాయికి వెళ్ళిపోతుందో కార్మికులందరూ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులపై భారం పెంచేందుకు యజమాన్యం ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నిటినీ తిప్పి కొట్టి కార్మికుల సంక్షేమంతో కూడుకున్న వేతన ఒప్పందాన్ని చేశామన్నారు. మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలలో 400 పైచిలుకు పర్మినెంట్ కార్మికులుంటే.. కాంట్రాక్టు కార్మికులు 1500 మంది ఉన్నారన్నారు. ప్రతి కార్మికుడికి స్థాయికి తగ్గట్టు ప్రమోషన్ పర్మినెంట్ తో పాటు వివిధ రకాల సౌకర్యాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. పెట్టుబడిదారులు కులాలు, వర్గాలు, దేవుళ్ళ పేరా కార్మికుల మధ్య చిచ్చుపెట్టి తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాటిపట్ల కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల్లో హెయిర్ అండ్ ఫైర్ అనే సిద్ధాంతాన్ని అమలు పరిచేందుకు పెట్టుబడిదారులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.

సర్‌ ‌ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగిస్తున్నందున ఎన్నికల కమిషన్ కి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటు హక్కును తొలగించడం ఎంతో నేరంతో కూడుకున్న పని అన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం మాట్లాడుతూ.. వేతన ఒప్పందంలో తీసుకున్న జాగ్రత్తలు సాధించిన విజయాలను కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహయ కార్యదర్శి మహిపాల్, యూనియన్ నాయకులు గణేష్, నరేష్, వంశీ, నరసయ్య, సంగన్న, రవి, ఉమామహేశ్వరరావు లతోపాటు వివిధ పరిశ్రమల్లోని అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్