- 35బంతుల్లోనే శతకం
నవతెలంగాణ హైదరాబాద్:
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20మ్యాచ్‌లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోర్లు,సిక్సర్లతో విరుచుకుపడి మైదానాన్ని హోరెత్తించాడు.వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ పోరులో ఆరంభం నుంచే బాదుడే లక్ష్యంగా ఆడిన అభిషేక్,కేవలం 15బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి,ఆ తర్వాత 35బంతుల్లోనే విధ్వంసకర శతకాన్ని చేరుకున్నాడు.క్రమంగా ధాటిగా ఆడుతూ మొత్తంగా 38బంతుల్లో 9ఫోర్లు, 11సిక్సర్ల సాయంతో 297.36మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్‌తో 113పరుగులు చేసి ఔటయ్యాడు.టీ20ఫార్మాట్లో అభిషేక్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
మరోవైపు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి తొలి వికెట్‌కు అభిషేక్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వైభవ్ ఒకవైపు భారీ షాట్లతో విరుచుకుపడుతుండగా,మరోవైపు అభిషేక్ రఫాడిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.వీరిద్దరి తుఫాన్ బ్యాటింగ్‌తో వెల్లింగ్టన్ ప్రేక్షకులు తీవ్రంగా అలరించబడ్డారు.







కామెంట్లు (0)