ఆఖరు మ్యాచ్‌లో 7 వికెట్లతో న్యూజిలాండ్ గెలుపు
3-2తో టీ20 సిరీస్ టీమ్ ఇండియా వశం
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా ఓటమితో ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్, ఆ తర్వాత ఆ జోరు చూపించలేదు. నామమాత్రపు చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ఆతిథ్య న్యూజిలాండ్ సిరీస్ ఓడినా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో సిరీస్‌ను మెరుగ్గా ముగించింది. ఆదవారం హామిల్టన్ టీ20లో భారత బ్యాటర్లు, బౌలర్లు నిరాశపరచగా న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
హామిల్టన్ (న్యూజిలాండ్)
టీ20 సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ విజయంతో ముగించింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (93, 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (65 నాటౌట్, 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్థ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ మెరవటంతో 192 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 18 ఓవర్లలో 3 వికెట్లకు న్యూజిలాండ్ 195 పరుగులు చేసింది. అంతకముందు, భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (61, 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (50, 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించినా, ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్ శర్మ (1), సంజూ శాంసన్ (4), తిలక్ వర్మ (6) తేలిపోయారు. కివీస్ పేసర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఆడమ్ మిల్నె (4/19) నాలుగు వికెట్లతో మెరిశాడు. సిరీస్‌లో నిలకడగా రాణించిన గ్లెన్ ఫిలిప్స్ (341 పరుగులు) 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. 3-2తో టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస బుధవారం ఆక్లాండ్‌తో తొలి మ్యాచ్‌తో ఆరంభం కానుంది.
అలవోకగా ఊదేశారు
192 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ (2) ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఫామ్‌లో ఉన్న డార్లీ మిచెల్(29, 16 బంతుల్లో 4 సిక్స్‌లు) తో కలిసి టిమ్ సీఫర్ట్ (93) రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. సీఫ్టర్ 11 ఫోర్లు, 5 సిక్సర్లతో వీర విహారం చేశాడు. డార్లీ అవుటైనా, గ్లెన్ ఫిలిప్స్ (65 నాటౌట్)తో కలిసి అలెన్ అదరగొట్టాడు. ఈ జోడీ భారత బౌలర్లపై ఎదురుదాడి చేసింది. దీంతో కివీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ ముంగిట అలెన్ అవుటైనా.. బెవాన్ జాకబ్స్ (1 నాటౌట్)తోడుగా ఫిలిప్స్ లాంఛనం ముగించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఇషాన్, శ్రేయస్ మెరిసినా..
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ సంజూ శాంసన్ (4), అభిషేక్ శర్మ (1) పేసర్ మిల్నెకు వికెట్ కోల్పోయారు. ఈ దశలో ఇషాన్ కిషన్ (61), శ్రేయస్ అయ్యర్ (50) మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నిర్మించారు. అర్థ సెంచరీలు సాధించిన ఇషాన్, శ్రేయస్‌లు భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. ఈ క్రమంలో వరుస వికెట్లు భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు తిలక్ వర్మ (6) సైతం వికెట్ కోల్పోయాడు. నమన్ ధీర్ (33, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (22, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆశించిన స్థాయిలో ఎదురుదాడి చేయలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లకు భారత్ 191 పరుగులే చేసింది. కివీస్ పేసర్ మిల్నె 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : సంజూ శాంసన్ (సి) బ్రాస్‌వెల్ (బి) మిల్నె 4, అభిషేక్ శర్మ (సి) డార్లీ (బి) మిల్నె 1, ఇషాన్ కిషన్ (సి) స్మిత్ (బి) టిక్నర్ 61, శ్రేయస్ అయ్యర్ (సి) సీఫ్టర్ (బి) స్మిత్ 50, తిలక్ వర్మ (సి,బి) స్మిత్ 6, నమన్ ధీర్ (సి) బ్రాస్‌వెల్ (బి) టిక్నర్ 33, నితీశ్ కుమార్ రెడ్డి (సి) ఫిలిప్స్ (బి) మిల్నె 22, భువనేశ్వర్ కుమార్ (సి) డార్లీ (బి) మిల్నె 6, ప్రిన్స్ యాదవ్ నాటౌట్ 0, అర్ష్‌దీప్ సింగ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 191.
వికెట్ల పతనం : 1-2, 2-19, 3-112, 4-123, 5-133, 6-179, 7-185, 8-190.
బౌలింగ్ : జాకబ్ డఫ్ఫీ 3-0-27-0, ఆడమ్ మిల్నె 4-0-19-4, నాథన్ స్మిత్ 3-0-28-2, బ్లెయిర్ టిక్నర్ 4-0-38-2, మిచెల్ శాంట్నర్ 4-0-39-0, మైకల్ బ్రాస్‌వెల్ 2-0-38-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : టిమ్ సీఫర్ట్ (బి) నితీశ్ కుమార్ రెడ్డి 93, ఫిన్ అలెన్ (సి) ఇషాన్ కిషన్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 2, డార్లీ మిచెల్ (సి) అభిషేక్ శర్మ (బి) వరుణ్ చక్రవర్తి 29, గ్లెన్ ఫిలిప్స్ నాటౌట్ 65, బెవాన్ జాకబ్స్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (18 ఓవర్లలో 3 వికెట్లకు) 195.
వికెట్ల పతనం : 1-9, 2-82, 3-168.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-41-0, అర్ష్‌దీప్ సింగ్ 4-0-40-1, ప్రిన్స్ యాదవ్ 3-0-35-0, వరుణ్ చక్రవర్తి 4-0-45-1, నితీశ్ కుమార్ రెడ్డి 2-0-19-1, అభిషేక్ శర్మ 1-0-13-0.






కామెంట్లు (0)