Magazines

ముకేశ్‌, సిరాజ్‌ విజృంభణ

54 నిమిషాల క్రితం

Mukesh and Siraj shine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూజిలాండ్‌-ఏకు

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

క్రైస్ట్‌‌చర్చ్‌ : పేసర్లు ముకేశ్‌ ‌కుమార్‌ (5/87), మహ్మద్ సిరాజ్‌ (4/118) నిప్పులు చెరిగే ప్రదర్శనతో సంయుక్తంగా 9 వికెట్లు పడగొట్టారు. క్రైస్ట్‌‌చర్చ్‌‌లో ఆతిథ్య కివీస్‌-ఏపై మెరుపు ప్రదర్శన చేసినా, టీమ్‌ ఇండియా కుర్రాళ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నారు. భారత్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ రెండో అనధికార టెస్టులో ఊహించినట్టుగానే కివీస్‌‌ కుర్రాళ్లు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకున్నారు. కెప్టెన్‌ ‌ధ్రువ్‌ ‌జురెల్‌ (105), దేవదత్‌ ‌పడిక్కల్‌ (80), ఆకాశ్‌ ‌దీప్‌ (68) మెరిసినా భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌‌లో 346 పరుగులే చేసింది. మాథ్యూ బోలె (110, 152 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌), డీన్‌ ‌ఫాక్స్‌‌క్రాఫ్ట్‌ (93, 226 బంతుల్లో 9 ఫోర్లు), క్రిస్టయన్‌ ‌క్లార్క్‌ (41), ఫ్రేజర్‌ ‌సీయట్‌ (40), జేడెన్‌ (32 నాటౌట్‌), మెక్‌‌కాయ్‌ (33) ‌రాణించటంతో న్యూజిలాండ్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌‌లో 424 పరుగులు చేసింది. పేసర్లు ముకేశ్‌ ‌కుమార్‌ (5/87), మహ్మద్‌ ‌సిరాజ్‌ (4/118) విజృంభించినా, తొలి ఇన్నింగ్స్‌‌లో ఆ జట్టు 78 పరుగుల ఆధిక్యం సొంతం చేసుకుంది. మూడో రోజు ఆఖర్లో రెండోసారి బ్యాట్‌ ‌పట్టిన భారత్‌-ఏ 11 ఓవర్లలో వికెట్‌ ‌నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌-ఏ 46 పరుగుల వెనుకంజలో నిలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్