ప్రభుసిమ్రన్, సాలిల్, రమణ్‌దీప్ అర్థ సెంచరీలు
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ తొలి రోజు
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజీ ట్రోఫీ మూడో రౌండ్లో హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ తొలి రోజు ఆసక్తికరంగా సాగింది. ఎర్ర మట్టి పిచ్‌పై 60 ఓవర్లలోపే ఐదు వికెట్లు పడగొట్టిన హైదరాబాద్.. ఆ తర్వాత వికెట్ల వేటలో నిరాశపరిచింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ తొలి రోజు 90 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా (12), హర్నూర్ సింగ్ (17), ఉదయ్ సహరాన్ (16)లు తొలి సెషన్లోనే అవుటైనా.. ప్రభుసిమ్రన్ సింగ్ (81, 126 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), సాలిల్ అరోరా (57 నాటౌట్, 143 బంతుల్లో 2 ఫోర్లు), రమణ్‌దీప్ సింగ్ (52, 79 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కార. జషన్‌ప్రీత్ సింగ్ (45, 84 బంతుల్లో 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రమణ్‌దీప్ సింగ్ ఆరంభంలో ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ రాహుల్ వదిలేయగా.. సాలిల్ అరోరాతో కలిసి రమణ్‌దీప్ సింగ్ ఆరో వికెట్‌కు 93 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించాడు. పేసర్లు రక్షణ్ రెడ్డి (2/53), సివి మిలింద్ (1/41), స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (1/85), అనికెత్ రెడ్డి (1/84) రాణించారు. పరుగుల వేట కష్టసాధ్యమైన జింఖానా గ్రౌండ్లో తొలి రోజే 289 పరుగులు చేసిన పంజాబ్.. నేడు భారీ స్కోరుపై గురిపెట్టింది. ఫామ్‌లో ఉన్న సాలిల్ అరోరా క్రీజులో ఉండటంతో నేడు మరో వంద పరుగులైనా జోడించే అవకాశం కనిపిస్తోంది.





కామెంట్లు (0)