Magazines

అక్రమ బంగారం 1500 శాతం పెరుగుదల

58 నిమిషాల క్రితం

Illegal gold imports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

దిగుమతి సుంకాల పెంపు ఎఫెక్ట్‌

మూడు నెలల్లోనే 50 టన్నుల ‌రవాణా

న్యూఢిల్లీ : భారత్‌‌లోకి బంగారం అక్రమ దిగుమతులు అమాంత పెరిగాయి. పసిడి దిగుమతులపై మోడీ ప్రభుత్వం భారీగా పెంచిన సుంకాలే ఇందుకు కారణం. ప్రభుత్వం విధించిన అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు అక్రమ మార్గాల్లో దిగుమతులు వస్తోన్నాయి. 2026 జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 50 మెట్రిక్ టన్నుల బంగారం అనధికారిక మార్గాల్లో భారత్‌కు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో ఈ పరిమాణం కేవలం 3 టన్నులుగా ఉండగా.. తాజాగా 1,500 శాతానికి పైగా పెరిగడం ఆందోళకరం. కన్సల్టెన్సీ సంస్థ మెటల్స్ ఫోకస్ గణాంకాల ఆధారంగా డబ్ల్యుజిసి ఈ వివరాలను వెల్లడించింది. 2023 తర్వాత అక్రమ బంగారం దిగుమతులు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. చమురు ధరలతో పెరుగుతోన్న వాణిజ్య లోటును నియంత్రిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 15 శాతానికి పెంచింది. దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం అనధికారిక మార్కెట్‌ను మరింత పెరగడానికి దారితీస్తోందని డబ్ల్యుజిసి పేర్కొంది. సుంకాల పెంపుతో అధికారికంగా పన్నులు చెల్లించి దిగుమతి చేసుకోవడం కంటే స్మగ్లింగ్, వ్యక్తిగతంగా చిన్న మొత్తాల్లో బంగారం తీసుకురావడం వంటి మార్గాలపై ఆసక్తి పెరిగింది. పన్నుల పెంపుతో గతంలోనూ అక్రమ దిగుమతులకు దారి తీసిన అంశాలను నివేదిక గుర్తు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్