Magazines

స్టాక్‌ మార్కెట్‌పై మళ్లీ బేర్స్‌ పంజా

16 నిమిషాల క్రితం

market
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

సెన్సెక్స్‌ 500 పాయింట్లు ‌పతనం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు బుధవారం బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఆటో, లోహ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 82,032కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 159 పాయింట్లు లేదా 0.63 శాతం తగ్గి 25,229 వద్ద ముగిసింది. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా షేర్లలో కొనుగోళ్లతో కొంత కోలుకుంది. నిఫ్టీలో టైటాన్‌ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌డిఎఫ్‌‌సి లైఫ్‌, బిఎస్‌ఇ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు అధికంగా నష్టపోయాయి. మరోవైపు ఎస్‌బిఐ, సిప్లా, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, ఐటిసి, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభాలతో ముగిసి సూచీలకు కొంత మద్దతునిచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్