Magazines

సమానత్వం అనేది 
మనుషుల మనసుల్లో రావాలి

14 నిమిషాల క్రితం

Equality
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

కోర్టులు బలవంతంగా రుద్దలేవు: సీజేఐ

న్యూఢిల్లీ: హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు న్యాయస్థానం దానికి పరిష్కారం చూపగలదని, కానీ ప్రజలు ఒకరినొకరు సమానంగా చూడాలని బలవంతం చేయలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆ గుర్తింపు సమాజం నుంచే రావాలని అభిప్రాయపడ్డారు. విద్యావేత్త ఫైజాన్ ముస్తఫా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. సౌభ్రాతృత్వమే మానవ శ్రేయస్సుకు, సామూహిక ప్రయోజనానికి వారధి అని అన్నారు. తమ పొరుగువారి స్థితిగతుల పట్ల స్త్రీ, పురుషులు ఉదాసీనంగా ఉన్నచోట ఈ రెండూ సాధ్యం కావని స్పష్టం చేశారు."రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సౌభ్రాతృత్వాన్ని ఎంతో ఆవశ్యకమైనదిగా భావించారు. దానిని భారతీయులందరి మధ్య ఉండే ఒక ఉమ్మడి సోదరభావంగా అభివర్ణించారు. సౌభ్రాతృత్వం లేకపోతే స్వేచ్ఛ, సమానత్వం అనేవి సహజమైన విషయాలుగా మారలేవని అంబేద్క ర్ హెచ్చరించారు. హక్కుల ఉల్లంఘనకు గురైతే కోర్టు పరిష్కారం చూపగలదు. కానీ ప్రజలు ఒకరినొకరు సమానంగా గౌరవించుకునేలా బలవంతం చేయలేదు. ఆ గుర్తింపు విస్తృత సమాజం నుంచే రావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇస్తుంది. మనిషి వికాసం గురించి మాట్లాడటం అంటే ఒక అడుగు ముందుకు వేయడమే" అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.


'ఈ లెక్చర్ న్యాయ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది'

విద్యావేత్త, ప్రొఫెసర్ ముస్తఫా తనకు చాలా దశాబ్దాలుగా తెలుసని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కాలంలో ముస్తఫా అంకితభావం గల ఉపాధ్యాయుడిగా, రాజ్యాంగ పండితుడిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారని తెలిపారు. అలాగే ముస్తఫా న్యాయ విద్యా మార్గదర్శకుడిగా ఎదగడాన్ని తాను చూశానని వెల్లడించారు. ముస్తఫా లెక్చర్ బెంచ్‌లో, బార్‌లో, న్యాయ విద్యా రంగంలో ఉన్నవారందరికీ ఎంతో ఆలోచించదగిన అంశాలను అందిస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. లా విద్యార్థులు, యువ న్యాయవాదులు, పరిశోధకుల కోసం ఈ ఉపన్యాసాన్ని రూపొందించినట్లు స్పష్టం చేశారు. తద్వారా వారు ఈ రంగంలోని అత్యుత్తమ మేధావుల సమక్షంలో సిలబస్‌కు, రోజువారీ వృత్తి అవసరాలకు అతీతమైన ఆలోచనలను క్రమం తప్పకుండా తెలుసుకోగలరని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్