Magazines

బోయింగ్‌లో 5 శాతం ఉద్యోగ కోతలు

8 నిమిషాల క్రితం

అమెరికా విమాన తయారీ సంస్థ బోయిం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

శాన్‌‌ఫ్రాన్సిస్కో : అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌ తన వాణిజ్య విమానాల విభాగంలో సుమారు 5 శాతం ఉద్యోగులను తగ్గించనుంది. బి737 మ్యాక్స్‌ విమానాల ఉత్పత్తి పెంపులో జాప్యం, ఉత్పత్తి ప్రక్రియల్లో మార్పుల కారణంగా అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ విభాగాధిపతి స్టెఫానీ పోప్‌ ఉద్యోగులకు పంపిన లేఖలో తెలిపారు. కొందరు స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వెళ్లిపోనుండగా, మరికొందరికి ఉద్వాసనలు పలకనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు డిసెంబర్‌లో జారీ చేయనున్నారు. ప్రస్తుతం నెలకు 47 విమానాల ఉత్పత్తికి ప్రయత్నిస్తున్న బోయింగ్‌.. 2027 ద్వితీయార్ధంలో ఈ సంఖ్యను 52కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే విమానాల రెక్కల తయారీలో జాప్యం కారణంగా ఉత్పత్తి పెంపు ఆలస్యమవుతోందని సిఇఒ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ ఇటీవల తెలిపారు. మరోవైపు ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్‌ ఎయిర్‌వేస్‌ 850 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) వినియోగం, కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఇఒ వెనిస్సా హడ్సన్‌ వెల్లడించారు. ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, మానవ వనరులు, మార్కెటింగ్‌ విభాగాల్లో తొలి విడత కోతలు చేపట్టనున్నారు. మరికొన్ని ఉద్యోగాలను కన్సల్టింగ్‌ సంస్థ యాక్సెంచర్‌కు అప్పగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ బదిలీల్లో భారత్‌కు చెందిన ఉద్యోగ బృందాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్