Magazines

దిశ మార్చుకున్న 'అక్వాన్'.. ఉత్తరాంధ్రకు హైఅలర్ట్

24 నిమిషాల క్రితం

అక్వాన్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఇది దిశ మార్చుకుని, తీవ్ర తుపానుగా మారి ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం సహా దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఈ తీవ్ర తుపాను నవంబర్ 20 మధ్యాహ్నానికి నరసాపురం – పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అక్వాన్' తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలింది. ప్రస్తుతం ఇది నరసాపురానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పుగా 560 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా ఉత్తర-వాయవ్య దిశలోనే ప్రయాణించి తీరం వైపు సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్