Magazines

ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న ‘అర్నాబ్’..

11 గంటల క్రితం

aranab-cyclone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను 'అర్నాబ్' వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. బుధవారం తెల్లవారుజామున 2-4 గంటల మధ్య బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవి గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగానికి చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాను ఔటర్ స్పైరల్ బ్యాండ్ ఇప్పటికే తీరాన్ని తాకడంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. కాగా.. తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 4,000 సైక్లోన్ షెల్టర్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు 50కి పైగా రైళ్లను రద్దు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్