నవతెలంగాణ హైదరాబాద్: కేరళలో న్యాయమూర్తి కుమారుడు పాల్గొన్న 'హిట్ అండ్ రన్'ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఘోర అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొచ్చి నగర పోలీస్ కమిషనర్ కళిరాజ్ మహేశ్ కుమార్ను బదిలీ చేయడమే కాకుండా,దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నట్టు గుర్తించి సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్,గ్రేడ్ సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సివిల్ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు హోం మంత్రి రమేశ్ చెన్నితాల వెల్లడించారు.
బాధితుడైన మృతుడి కుటుంబం పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు జడ్జి కుమారుడు కావడంతోనే అతడిని రక్షించేందుకు పోలీసులు కుట్ర పన్నారని, మైనర్ అయినప్పటికీ రకరకాల సాకులు చూపి కొన్ని గంటల వ్యవధిలోనే రెండుసార్లు బెయిల్ పొందేలా సహకరించారని ఆరోపించింది.ఈ వ్యవహారం అసెంబ్లీలో కూడా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
ఈ క్రమంలో ఒక మైనర్ నేరానికి పాల్పడినప్పుడు మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడిపై కేసు నమోదు చేయాల్సి ఉన్నందున..ఈ కేసులో సదరు న్యాయమూర్తిని నిందితుడిగా చేర్చేందుకు కేరళ హైకోర్టు సోమవారం అనుమతించింది.హైకోర్టు అనుమతి లభించిన వెంటనే మంగళవారం పోలీసులు జడ్జి నివాసంలో సోదాలు నిర్వహించారు.






కామెంట్లు (0)