నవతెలంగాణ-హైదరాబాద్ : కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన గోపీనాథ్, సమత 2023లో ప్రేమ వివాహం చేసుకుని.. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల పాప ఉంది. మంగళవారం ఉదయం నుంచి ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి డయల్ 112కి ఫోన్ చేసి సమాచారం అందించారు.
పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా.. గోపీనాథ్, సమత డైనింగ్ హాల్లో ఉరివేసుకొని కనిపించారు. బెడ్‌రూమ్‌లో పాప విగతజీవిగా కనిపించింది. పాపని చంపేసి ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. బలవన్మరణానికి ముందు గోపీనాథ్, సమత గోడపై రాసినట్టు పోలీసులు గుర్తించారు. గోపీనాథ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)