నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం దారుణం జరిగింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థినిపై దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
పదో తరగతి విద్యార్థినిపై మిషన్తో దాడి
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)