నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల కొన్ని విద్యాసంస్థల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భద్రతా లోపాల కారణంగా విద్యార్థులు ప్రమాదాలకు గురవడం, ఓ విద్యార్థి మృతి చెందడం వంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఏయే కార్యక్రమాలు నిర్వహించవచ్చనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విద్యా ప్రాంగణాలను ప్రధానంగా విద్యా, క్రీడా కార్యక్రమాలకే పరిమితం చేయాలని భావిస్తోంది. మరోవైపు, విద్యార్థుల భద్రతకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రూపొందించిన ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లపై నిషేధం?
41 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)