Magazines

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు..అభిజీత్ దిప్కే ఆసక్తికర వ్యాఖ్యలు

14 నిమిషాల క్రితం

Elections in five states... Abhijit Dipke's interesting comments

Abhijit Dipke

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: యువతకు సంబంధించిన సమస్యలపైనే తమ ఫోకస్ ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కార్యకర్త అభిజీత్ దిప్కే అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ నిర్మూలన ప్రధాన రాజకీయ చర్చాంశాలుగా ఉండేలా తమ ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు నవంబర్ 26న నాగపూర్‌ లో ఆందోళన ఉంటుందని, 'ఓట్ల చోరీ'పై కేంద్ర ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్.


"ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా కూల్చివేయడం కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం కాదు. దేశ రాజకీయాలు, రాబోయే ఎన్నికలు యువతకు సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించేలా చూడటమే మా ఏకైక లక్ష్యం. విద్య, నిరుద్యోగం, నాణ్యమైన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే అంశాలపైనే రాబోయే ఎన్నికల్లో చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము" అని మహారాష్ట్రలోని శంభాజీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిప్కే పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్