Magazines

విద్యార్థులకు గుడ్ న్యూస్‌..

48 నిమిషాల క్రితం

Good news for students..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: నవంబర్‌ నెలలో విద్యార్థులకు పండుగలు, ఆదివారాల కారణంగా 8 నుంచి 13 రోజుల వరకు సెలవులు లభించే అవకాశం ఉంది. దీపావళి, గోవర్ధన్‌ పూజ, భాయ్‌ దూజ్‌, ఛత్‌ పూజ, గురునానక్‌ జయంతి వంటి పండుగల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు.

నవంబర్‌ 8న దీపావళి, 9న గోవర్ధన్‌ పూజ, 11న భాయ్‌ దూజ్‌, 15న ఛత్‌ పూజ, 24న గురునానక్‌ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా సెలవుల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. ఏపీ, తెలంగాణ విద్యార్థులు తమ పాఠశాలల అధికారిక సెలవుల ప్రకటనలను గమనించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్