నవతెలంగాణ - హైదరాబాద్ : ఒమన్ తీరంలో భారతదేశానికి చెందిన ‘ఎంఎస్వీ అల్ జుసుఫీ’ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన భారతీయ నావికుడు గంధర్ నహీం అజీజ్ మృతిచెందినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉండగా, వారిలో 13 మందిని ఒమన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు. రక్షించిన నావికులతో పాటు మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.




కామెంట్లు (0)