Magazines

తమిళ సినిమాలకు సీఎం గుడ్ న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి

29 నిమిషాల క్రితం

Good news for Tamil movies.. permission for six shows per day
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళ సినీ పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రంలోని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు ఈ వెసులుబాటు వర్తించనుంది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఈ షోలను ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లోనూ రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చింది.


గతంలో రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉండగా, అనంతరం ఐదు షోలకు పెంచారు. తాజాగా మరో షోను అదనంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, షోల సంఖ్య పెంపుతో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని పలు సినీ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. వారి విజ్ఞప్తులపై పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులపై తమిళ సినీ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్