Magazines

ఏపీలో జనసేన విజయం.. మక్తల్‌లో కార్యకర్తలు సంబరాలు

26 నిమిషాల క్రితం

Jana Sena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- టపాసులు కాల్చి.. స్వీట్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు

నవతెలంగాణ - మక్తల్ 

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మక్తల్ మున్సిపాలిటీలోని రెండో వార్డులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, స్థానిక ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జనసేన–కూటమి సాధించిన విజయం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు.


ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, పార్టీ కార్యకర్తల నిరంతర కృషికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండో వార్డు అధ్యక్షుడు గౌడి బాల్ రెడ్డి, గౌడి రవీందర్ రెడ్డి, బాదేపల్లి నరేష్ గౌడ్, టప్ప పవన్, టప్ప విజయ, కర్ణి తిమ్మయ్య, టీ. సురేష్, టప్ప రాజశేఖర్, టప్ప తిరుమలేష్, శివరెడ్డి, కిరణ్ రెడ్డి, యాదగిరి, రఘురెడ్డి, దిలీప్ రెడ్డి, టప్ప తిమ్మయ్యతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్