నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సన్న బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ వివిధ రకాల సన్న బియ్యానికి గరిష్ఠ చిల్లర ధరలను నిర్ణయించింది.
తాజా నిర్ణయం ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకాలు రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలు రూ.79కు మించి విక్రయించకూడదని ఆదేశించింది. ఈ ధరల పట్టికను ప్రతి దుకాణంలోనూ ప్రదర్శించాలని స్పష్టం చేసింది. మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్వహించిన తనిఖీల్లో తూకంలో తేడాలు, ఎంఆర్పీ స్టిక్కర్ల ట్యాంపరింగ్ వంటి ఉల్లంఘనలపై ఆరు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







కామెంట్లు (0)