నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్ సూపర్ హీరో, బ్రిటిష్ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులతో బాధపడుతున్న ఆయన, లాస్ ఏంజెలిస్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మార్వెల్ ఫ్రాంచైజ్ 'ఎక్స్-మెన్' చిత్రాలలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, 'స్టార్ ట్రెక్- ది నెక్స్ట్ జనరేషన్'లో కెప్టెన్ పాత్రతో విశేష ప్రాచుర్యం పొందారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో హాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగిన స్టీవర్ట్, పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)