నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానా చండీగఢ్‌లోని పంచకులాలో దారుణం జరిగింది. ఒక పాఠశాలలో తీవ్ర కలవరపరిచే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల విద్యార్థి, ఎల్ కేజీ చదివే బాలిక(6)పై విచక్షణరహితంగా దాడి చేశాడు. కాళ్లతో తన్ని, ఇటుకలతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. నిందితుడైన విద్యార్థి ఆ చిన్నారి జుట్టు పట్టుకుని, ఆమె తలను బల్లకు బలంగా బాదాడు. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను పీజీఐ చండీగఢ్‌కు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పంచకులాలో దారుణం.బాలికపై మూడో తరగతి విద్యార్థి దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)