నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగనున్న రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ వేసే సమయానికి వర్షం పడటంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది. వర్షం తగ్గిన తర్వాత టాస్ వేసే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డే కూడా వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో సాగింది. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Ind vs znd: రెండో వన్డే.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)