Magazines

పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

12 నవంబర్, 2026

Individual arrested for posting offensive content about Pawan Kalyan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా, జనసేన కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య విభేదాలు సృష్టించేలా పోస్టులు ఉన్నాయని పిఠాపురం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన పలువురిపై కూడా కేసులు నమోదైనట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్