నవతెలంగాణ - హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బీసీ కాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జోగినిగా పేరు పొందిన సుధాకర్(50)ను దుండగులు హత్య చేశారు. అతడిని ఇంట్లోనే చంపి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ తీసుకుని.. మృతుడి కారులోనే నిందితులు పరారయ్యారు. కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
చౌటుప్పల్లో జోగిని దారుణ హత్య
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)