Magazines

తనిఖీల్లో భారీ నగదు స్వాధీనం

1 గంట క్రితం

cash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా, ఖుర్సిపార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక పికప్ వాహనం నుంచి రూ. 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శోభ్‌రాజ్ అగర్వాల్ తెలిపారు. భారీ మొత్తంలో నగదును ఒక తెల్లని పికప్ ట్రక్కులో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. దీనితో ఆ వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా, అందులో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని ప్రత్యేక దర్యాప్తు చేపడుతామని తెలిజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్