నవతెలంగాణ-హైదరాబాద్: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని పలు రోజులుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసనలతో తగ్గిన వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఎలాంటి విధి విధానాలు స్పష్టం చేయకుండా ప్రకటన జారీపై విశ్వసం లేదని విద్యార్థులు తెలియజేశారు. ఎన్నికల తేదీని ప్రకటించాలని, తమ డిమాండ్లపై లిఖితపూర్వక హామీలు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు నిర్దిష్ట గడువు ప్రకటించకుండా కేవలం హామీలు ఇవ్వడం తమ డిమాండ్ల పరిష్కారం కాదని వారు స్పష్టం చేశారు. స్పస్టత వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు తెలియజేశారు.
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో నిరసనలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)