Magazines

ఖర్గే నివాసంలో ఇండియా బ్లాక్ నాయకుల సమావేశం

1 గంట క్రితం

INDIA bloc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్షాలు భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా బ్లాక్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సభలో, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) వ్యవహారానికి సంబంధించి, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. 'చలో దిల్లీ రామ్‌లీలా మార్చ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. దక్షిణ రాష్ట్రాలకు చెందిన పార్టీలతో సహా పలు రాజకీయ పక్షాలు ఈ సభకు మద్దతు ప్రకటించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్