నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో గ్రామంలోని బోర్లు,చేతిపంపులు,మిషన్ భగీరథ నీటి సరఫరా కేంద్రాల నుంచి గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు నీటి నమూనాలను సేకరించి ఫ్లోరైడ్ పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన,సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటి నాణ్యతను పరిశీలించేందుకు నీటి నమూనాల సేకరణ చెప్పటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాజీరా,వార్డు సభ్యులు భీమనగోని యాదయ్య, పగిల్లా శంకర్,మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
రాంరెడ్డి పల్లి లో ఫ్లోరైడ్ పరీక్షలు
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)