నవతెలంగాణ - హైదరాబాద్ : ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అథ్లెట్ల కమిషన్ చైర్‌పర్సన్‌గా స్టార్ షట్లర్ పీవీ సింధు, వైస్ చైర్‌పర్సన్‌గా భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి సంజయ్ కె. శ్రీవాస్తవ ప్రకటించారు. ఐవోఏ జనరల్ బాడీ అథ్లెట్ల కమిషన్‌లో ప్రతినిధులుగా మీరాబాయి చాను, సాజన్ ప్రకాష్ నియమితులయ్యారు. డిసెంబర్ 5న జరగనున్న ఐవోఏ ఎన్నికల అనంతరం కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సింధు, హర్మన్‌ప్రీత్ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ నలుగురితో పాటు అథ్లెట్ల కమిషన్‌లోని మొత్తం 10 మంది సభ్యులు 2026–30 వరకు నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఐవోఏ అథ్లెట్ల కమిషన్ చైర్‌పర్సన్‌గా పీవీ సింధు
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)