Magazines

నాగోల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

20 అక్టోబర్, 2026

metro station
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: నాగోల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే మార్గంలో కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ నంబర్‌ 814 వద్ద వాటర్‌ పైప్‌లైన్‌కు చెందిన ఎయిర్‌ రిలీజింగ్‌ వాల్వును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హయత్‌నగర్‌కు చెందిన వినీత్‌ (24) ప్రాణాలు కోల్పోయాడు.


సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జలమండలి అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జలమండలి సిబ్బంది దెబ్బతిన్న వాల్వుకు మరమ్మతులు చేపట్టి, నీటి ప్రవాహాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్