నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నిఘా వ్యవస్థను ప్రాంతీయ, ప్రధాన కార్యాలయాలతో అనుసంధానించనున్నారు. దీంతో బస్స్టేషన్లలో రద్దీ, ప్రయాణికుల రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆర్టీసీ తెలిపింది.
ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్స్టేషన్లలో సీసీ కెమెరాలు..!
11 నవంబర్, 2026

RTC
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)