నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అత్యవసర కార్యకలాపాల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రకటించింది. ఇందులో భాగంగా లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న తిరిగి సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రవేశపెట్టే బిల్లులపై అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ఖరారు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)