నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని 22వ వార్డుకు చెందిన మొరమనేని సత్యంబాబు (మెస్ బాబు) మృతి పట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి గృహానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... సత్యంబాబు తమతో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారని, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రెహమాత్ పాషా (బజాజ్ షోరూం), వలీ పాల్గొని మెస్ బాబుకు నివాళులర్పించారు.






కామెంట్‌లు (0)