Magazines

అగ్నివీరుల సేవాకాలం మరో రెండేళ్లు పొడిగింపు

15 నిమిషాల క్రితం

Service tenure of Agniveers extended by another two years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అగ్నివీరుల సేవా కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్‌ పథకం కింద నాలుగేళ్లు సేవాకాలం పూర్తిచేసుకున్న వారిలో సాయుధ దళాల్లోకి ఎంపిక కాని వారి సేవాకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్‌ ) జనరల్‌ ఎన్‌.ఎస్‌. రాజా సుబ్రహ్మణ్యం బుధవారం ప్రకటించారు. నాలుగేళ్లు పూర్తయిన వారిలో 25శాతం మందిని నిబంధనల ప్రకారం వారి ప్రతిభ, అర్హతల ఆధారంగా రెగ్యులర్‌ సాయుధ దళాల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. మొదటి విడతలో నియమితులైన అగ్నివీరుల నాలుగేళ్ల సేవా కాలం త్వరలో ముగియనుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.


అదనపు రెండేళ్ల సేవా కాలం పూర్తయిన తర్వాత నిర్దేశిత ఎంపిక ప్రమాణాలను అందుకున్న, రెగ్యులర్‌ సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపే అగ్నివీరులకు శాశ్వత సైనికులుగా కొనసాగే అవకాశం ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. నాలుగేళ్లు లేదా ఆరేళ్ల సేవాకాలం అనంతరం ఈ అవకాశం లభిస్తుందని ఆయన 'ఎక్స్‌' పోస్ట్‌లో తెలిపారు. అగ్నిపథ్‌ పథకంపై ప్రతిపక్షాలు సహా పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్