నవతెలంగాణ-మద్నూర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు సర్పంచులు ప్రత్యేకంగా కృషి చేయాలని డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 45 రోజులకు ఒకసారి నిర్వహించే మండల స్థాయి ప్రత్యేక సమావేశం మండల ప్రత్యేక అధికారి రమ్య అధ్యక్షతన డోంగ్లి మండల సమావేశం బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎంపీడీవో తో పాటు ఉమ్మడి మండల ఎంపీఓ సత్యనారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులు గ్రామ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)