నవతెలంగాణ – హైదరాబాద్ : స్పెయిన్లోని మాడ్రిడ్–సెవిల్లే మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె రాజీనామా చేశారు. అక్టోబర్ 28న సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం, కంట్రోల్ రూమ్ నుంచి అందిన తప్పుడు సంకేతాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 69 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే రెండో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ స్పెయిన్ రవాణా మంత్రి రాజీనామా
1 గంట క్రితం

Spain
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)