Magazines

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే టార్గెట్: సీఎం రేవంత్

15 నిమిషాల క్రితం

I do not seek any new positions: CM Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్-2026’లో మాట్లాడుతూ.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, 2047 నాటికి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ORR, RRRతో పాటు మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్