Magazines

‘ఇరుముడి’ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

7 గంటల క్రితం

Telangana government issues notices to ‘Irumudi’ makers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. బాలనటి విషయంలో బాలకార్మిక చట్ట నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. జై లోక్‌సత్తా సోషల్‌ జస్టిస్‌ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్‌బాబు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. బాలిక నటనకు జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి, తల్లిదండ్రుల సమ్మతి, పారితోషికంలో 20 శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, షూటింగ్‌ పని గంటలు, చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలపై వివరణ కోరారు. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో పూర్తి ఆధారాలతో విచారణకు హాజరుకావాలని నిర్మాతలను ఆదేశించారు. ఈ నోటీసులపై నిర్మాణ సంస్థ ఇంకా స్పందించలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్