నవతెలంగాణ - హైదరాబాద్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘సత్యం శివం సుందరం’ అనే పదాలతో పాటు శివుడికి సంబంధించిన చిహ్నాన్ని ఆయన పంచుకున్నారు. ఎస్‌ఐఆర్‌పై పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఈ పోస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఎస్‌ఐఆర్‌పై వివాదం ఏంటి?
ఓటర్ల జాబితాలను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రక్రియే ఎస్‌ఐఆర్. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయ సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలను ఎన్నికల సంఘం సమర్థించింది. ఈ అంశంపై ఇరు పక్షాల వాదనలు, న్యాయస్థాన విచారణపై ఆసక్తి నెలకొంది.





కామెంట్‌లు (0)