Magazines

విశాఖలో 10 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

1 గంట క్రితం

Sea rises 10 meters in Visakhapatnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖపట్నం తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో పాటు సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించారు. తుపాను తీవ్రత దృష్ట్యా రుషికొండ, ఆర్కే బీచ్‌లను మూసివేశారు. ప్రజలు, పర్యాటకులు బీచ్‌లకు వెళ్లవద్దని, అధికారుల హెచ్చరికలను పాటించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్