Magazines

విషాదం.. దుర్గం చెరువులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు

1 గంట క్రితం

Tragedy.. Software employee goes missing in Durgam Lake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన రాజేశ్‌ (25)గా గుర్తించారు. మాదాపూర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. రాజేశ్‌ నాచారంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. అనంతరం దుర్గం చెరువు వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాజేశ్‌ సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దుర్గం చెరువులో గల్లంతైన రాజేశ్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్